లిప్పన్‌ కళాకృతులు

లిప్పన్‌ ఆర్ట్‌ లేదా మడ్‌ మిర్రర్‌ ఆర్ట్‌ అనేది గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన కళ. నేను గత నెలలోనే గుజరాత్‌ రాష్ట్రాన్ని చూడటానికి వెళ్ళాను. అక్కడ గాంధీజీ పాదముద్రలతో పాటు ఆ రాష్ట్ర సాంప్రదాయ కళల్ని కూడా చూశాను. మేము వెళ్ళిన జాతీయ పిల్లల వైద్య నిపుణుల సమావేశంలో అక్కడి సంస్కృతి కళలకు సంబంధించి స్టాల్స్‌ ఎన్నో పెట్టారు. వాటిలో ఈ లిప్పన్‌ ఆర్ట్‌ స్టాల్‌ కూడా ఉంది. మట్టితో తయారయే కళా రూపాల్ని, గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇళ్ళను అలంకరించుకోవడానికి తయారు చేసుకుంటారు. ఈ లిప్పన్‌ ఆర్ట్‌కు గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ ప్రాంతం పేరు. మా చిన్నప్పుడు ఎంతో గొప్పగా నేర్చుకున్న ‘కచ్‌ వర్క్‌’ ఈ ప్రాంతందే అని తెలుసుకునే సరికి ఎంతో ఆనందమేసింది. కచ్‌ వర్క్‌ నేర్చుకుంటే కుట్లు కుట్టడంలో బి.ఎ పాస్‌ అయినట్టే. కచ్‌ వర్క్‌ అంటే అంత కష్టంగానూ, అంత గొప్పగానూ చెప్పుకునేవారు. లిప్పన్‌ ఆర్ట్‌ను మట్టి, ఆవుపేడ కలిపి ఇళ్ళ గోడలను అందంగా తీర్చిదిద్దుతారు.
లిప్పన్‌ ఆర్ట్‌లో బేస్‌గా వాడటానికి అట్టముక్కలు, మందపాటి ఎమ్‌డిఎఫ్‌ బోర్డుల్ని ఉపయోగిస్తాము. బాగా మందంగా ఉన్న ఎండిఎఫ్‌ బోర్డును నలుచదరంగా కత్తిరించుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డుపై మనకు నచ్చిన డిజైనును గీసుకోవాలి. మొదట పెన్సిల్‌తో గీసి ఉంచుకుంటే దానిపై మట్టి మిశ్రమంతో గీతలు గీసుకోవచ్చు. పూర్వకాలంలో మట్టి, పేడల మిశ్రమం వాడినప్పటికీ ఈ కాలంలో మనం వాల్‌పుట్టీ పౌడర్‌ను వాడవచ్చు. వాల్‌ పుట్టి పౌడర్‌ను తెచ్చుకుని దానిలో ఫెవికాల్‌ను కలిపి ముద్దగా చేసుకోవాలి. ఇంకొంచం మెత్తగా ఫైన్‌గా రావడానికి రెండు చుక్కల నీరు, రెండు చుక్కల నూనెను కలపాలి. కోన్‌లో నుంచి జారేలా కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. అంటే గోరింటాకు కోన్‌ను తయారుచేసినట్లుగా, ప్లాస్టిక్‌ కాగితపు కోన్‌లో వాల్‌ పుట్టి మిశ్రమాన్ని నింపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ గజిబిజి లేకుండా సులభమైన గీతల డిజైన్‌ను వేసుకుని, దానిపై కోన్‌తో మిశ్రమాన్ని దిద్దాలి. ఇది పూర్తిగా ఎండిన తర్వాత రంగులు వెయ్యాలి. రెండు మూడు రంగుల డిజైన్‌లు వేసుకోవాలి. రంగులు వేయటం పూర్తయ్యాక అద్దాలు అతికించాలి. గుండ్రం, నలుచదరం, డైమండ్‌ ఆకారాల అద్దాలను అందంగా అతికించి కళాకృతిని కనువిందుగా మలుచుకోవాలి.
పాత డబ్బాలపై డిజైన్లు
వాల్‌పుట్టితో పాటు ఎమ్‌సీల్‌ కూడా ఉపయోగించవచ్చు. లేదంటే షాపుల్లో దొరికే శిల్పకార్‌క్లేను కూడా వాడవచ్చు. ఆర్ట్‌ షాపుల్లో క్లే పౌడర్‌ దొరుకుతుంది. రకరకాల కంపెనీల మట్టి దొరుకుతుంది. వీటిలో ఏదైనా వాడవచ్చు. మేము దిగిన హౌటల్‌లో కూడా ఈ మట్టి ఫ్రేములు ఎన్నో అలంకరించబడ్డాయి. ఎయిర్‌పోర్టులోనూ ఈ మట్టి కళాకృతులు ఎన్నో కనిపించాయి. వాల్‌పుట్టి మిశ్రమాలకు రంగులు వేసి కూడా వాడవచ్చు. దీని కోసం యాక్రిలిక్‌ రంగుల్ని వాడవచ్చు. లేదంటే ఫుడ్‌ కలర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి రంగుల మట్టితో ప్లాస్టిక్‌ డబ్బాలు, సీసాల మీద కూడా డిజైన్లు వేయవచ్చు. రంగుల మట్టిలో మెటాలిక్‌ రంగుల్ని లేదా మెరుపుల్ని కూడా వాడితే బాగుంటుంది. హార్లిక్స్‌ డబ్బాలకు ఈ డిజైను వేసుకుంటే అందంగా ఉంటుంది. రంగుల పుట్టి కోన్‌లతో చుక్కలు, గీతలు గీసుకన్నట్టుగా డిజైన్‌ వేసుకోవచ్చు. హార్లిక్స్‌ డబ్బానే కాదు ఏదైనా ప్లాస్టిక్‌ డబ్బాలను వాడుకోవచ్చు. రంగురంగుల మట్టితో డిజైన్లు వేశాక అద్దాలు అతికించుకోవచ్చు. దీనిలో పూలు పెట్టుకుని పూల కుండీగా వాడుకోవచ్చు. లేదంటే టీపారు మీద అందంగా అలంకరించుకోవచ్చు.
ఫ్రేములపై డిజైన్లు
కొన్ని పెద్ద ఫ్రేములను వేసుకునేటపుడు కోన్లు తయారు చేసుకోనవసరం లేదు. పిండి మిశ్రమం కలుపుకున్నాక పక్కన పెట్టుకుని చేత్తో బండమీద తాల్చుకోవాలి. తాళ్ళను పేనినట్టుగా సన్నగా చేత్తో పాలతాలికలు చేసినట్టుగా చేసుకోవాలి. ఒకే విధంగా ఉండేలా తాడులా పేనినాక బోర్డు మీద పెన్సిల్‌ గీత వెంబడి అతికించుకుంటూ పోవాలి. చివర్లు కత్తిరించడానికి చిన్న కత్తి వాడాలి. దానికి కావాల్సిన టూల్స్‌ కూడా షాపుల్లో దొరుకుతాయి. మొత్తం డిజైను పూర్తయ్యాక గీతల వెంట అతికిన తాడు మీద సన్నగా గాట్లు పెట్టుకోవాలి. టూత్‌పిక్స్‌, ఫోల్‌సెప్స్‌, నీడిల్‌ వంటివి వాడితే మెలిబెట్టిన తాడు లాగా డిజైను వస్తుంది. మనకు నచ్చినట్టుగా డిజైన్లు చేసుకోవచ్చు. రంగులు వేసుకోవాలి. అద్దాలు కూడా అతికించాలి. గుజరాత్‌ గ్రామాల్లో మట్టితో పాటు ఒంటె పేడను కూడా కలపుతారు. దీనివల్ల ఇంటిలోపల చల్లదనంగా ఉంటుంది. ఇది ప్రధానంగా లోపలి గోడలకు పరిమితమైనప్పటికీ, వెలుపలి గోడలపై కూడా కళాకృతులు వేసుకుంటారు.
ఆకులపై కూడా…
ఈ లిప్పన్‌ ఆర్ట్‌ను ఆకుల మీద కూడా వేయవచ్చు. ఆకులను బాగా ఎండబెట్టి దాని మీద ఈ ఆర్ట్‌ను వేయవచ్చు. మామిడి, బాదం, రావి ఆకులను పేపర్ల మధ్యలో ఎండబెట్టాలి. ఎండాక దాని మీద సులభమైన డిజైన్లు వేసుకుంటే బాగుంటుంది. మొదటగా ఆకును పూర్తి ఆకుపచ్చ రంగును వేసుకోవాలి. రంగుతో నింపాక కోన్‌తో సన్నగా డిజైన్లు వెయ్యాలి. దీనికి మరల రంగులు వెయ్యడం కష్టం కాబట్టి రంగుల మట్టి కోన్లు వాడితే బాగుంటుంది. నాలుగైదు రంగుల కోన్లు తయారు చేసి ఉంచుకుంటే బాగుంటుంది. కోన్ల చివరి భాగం గాలి పోకుండా జాగ్రత్తగా అతికించుకోవాలి. వాడేటప్పుడు చివర్న కత్తిరించాలి. ఏ మాత్రం గాలి దూరినా మొత్తం కోన్‌ ఎండిపోతుంది. ఇలా ఆకు మీద డిజైను వెరైటీగా ఉంటుంది.
నగలు చేసుకుందాం…
మందపాటి జనపనార షీట్లపై లిప్పన్‌ ఆర్ట్‌ వేయవచ్చు. ఆర్ట్‌లో రకరకాల డిజైన్లు వేసినట్టుగా, బేస్‌లో కూడా రకరకాలుగా పెట్టుకోవచ్చు. మందపాటి గోతం సంచిని ఫెవికాల్‌ కలిపి ఎండబెడితే వంగిపోకుండా గట్టిగా ఉంటుంది. దీనిపై మట్టి కోన్‌తో డిజైన్లు వేసుకోవచ్చు. ఇంకా మట్టి మిశ్రమంతో జువెల్లరీ కూడా చేసుకోవచ్చు. నెక్లెస్‌లాగా కూడా చేసుకోవచ్చు. ముందు చిన్న ఉంగరం చేసుకుందాం. పుట్టి మిశ్రమాన్ని గుండ్రంగా చేత్తో తాల్చినాక చప్పగా అణగగొట్టినట్లుగా చేయాలి. చిన్న స్కేలుతో నొక్కితే చప్పగా అణుగుతుంది. దీన్ని గుండ్రంగా వేలుకు చుట్టుకొని దానికి రంగులు వేయాలి. గుండ్రని ఉంగరానికి డిజైన్లు వేసి ఆరనివ్వాలి. ఇలా సరదాగా ఉంగరాలు చేసి పెట్టుకోవచ్చు.

– డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

Spread the love
Latest updates news (2024-05-19 03:35):

does 0Ff a payday candy bar spike your blood sugar | normal blood sugar levels aOK for non diabetic not fasting | gyu low blood sugar reaction diabetes | after X7V meals blood sugar levels | when should you test for blood sugar jg9 | my blood sugar is 96 mg VK5 dl | ceylon cinnamon lower blood sugar QES | aNU does sugar make blood pressure go up | 116 blood sugar 51x in morning | celery and blood sugar sl6 | what drinks J6u lower blood sugar | blood sugar big sale monitor | how to kfD increase blood sugar levels fast | how much does sugar intake affect aK4 my blood sugar | hxH what should a normal fasting blood sugar be | how to lower blood sugar YQF when too high | normal blood sugar Rxr levels after food | omega blood sugar supplement IiE | foods that do not raise blood vIY sugar cook book | dr axe low f7i blood sugar | siadh will blood sugar be low or high r6z | fasting blood sugar level Sn0 118 | does TgG acyclovir affect blood sugar | ketosis and fasting VxW blood sugar | blood sugar dietary supplements FHi | is a fasting blood N0w sugar of 97 normal | postprandial blood sugar goals gestational nxX diabetes | cheese on blood nP6 sugar diet | 3VT blood sugar stabilizing smoothie | is 135 blood Vqx sugar high at night | what endocrine organ regulates blood sugar wbz level | alcohol reduces blood F6r sugar | when blood sugar HfG levels drop | carbohydrates blood SyJ sugar insulin | supplements vitamins regulate blood qu7 sugar | fasting brings oQO blood sugar down | will drinking miller lite beer cause blood sugar to owI drop | is 22J blood sugar level of 100 higher in the morning | effects of blood 6hc sugar over 1000 | normal eWU blood sugar after large meal | irregular blood sugar sQ1 levels | atH can steroids elevate your blood sugar | does melatonin cause high blood sugar 7kO | testosterone blood sugar cbd oil | low blood sugar cause mzy sleepiness | can untreated diabetes cause low blood 4TO sugar | 110 blood sugar after meal idD | high blood kTK sugar level management | Ojc normal blood sugar postprandial | blood K2e sugar and blurry vision