
– అధికార బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చివేత
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే హామీ నెరవేరేనా మద్నూర్ మండలానికి డిగ్రీ కాలేజ్ మంజూరు అయ్యేనా అంటూ ఈనెల 15న నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా మద్నూర్ మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయించి దాని ప్రోసిడింగ్ కాపీ ఉత్తర్వులు జారీ చేయించడంలో ప్రత్యేక కృషి చేశారు. దీనికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కృషి చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ మద్నూర్ ఉమ్మడి మండలంలోని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు గ్రామంలోని పెద్దలు వ్యాపారస్తులు యువకులు కలిసి శనివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో ముందుగా ముఖ్యమంత్రి చిత్రపటానికి అలాగే ఎంపీ బీబీ పాటిల్ చిత్రపటానికి ఎమ్మెల్యే హనుమంతు సిండే చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఎదుట టపాకాయలు కాలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ ఉమ్మడి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మద్నూరు గ్రామ సర్పంచ్ సురేష్ ఉపాధ్యక్షులు షేక్ గఫర్ మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ దొంగిలి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్ మద్నూర్ సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ విజయ్ ఉమ్మడి మద్నూర్ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ దిగంబరావ్ పాటిల్ మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ టీచర్స్ యూనియన్ పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు ఇతర ఉపాధ్యాయులు మద్నూర్ డోంగ్లి మండలాల్లోని సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.