నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

నవతెలంగాణ-కంటేశ్వర్
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా వారు కాంగ్రెస్ భవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వినాయక్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. పిన్న వయసులో భారతదేశ ప్రధానిగా ఎన్నికై భారతదేశాన్ని శాస్త్ర, సాంకేతిక, తొలి కమ్యూనికేషన్ రంగాన్ని దేశంలో అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించి, విద్యాసంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ ని , రాజీవ్ గాంధీ యొక్క స్ఫూర్తిని దేశంలోని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్రంలో రైతుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుండి నుండి రైతులను మోసం చేస్తూ తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని ఒక సంవత్సరం వారిని వేయమని మరో సంవత్సరం మొక్కజొన్న వేయమని మరో సంవత్సరం దొడ్డు రకం వడ్లు కొనమని ఇలా సంవత్సరానికో పంట వేయమని రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని, కెసిఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు లేని విధంగా కేసీఆర్ పాలన రెట్టింపు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి మీరు అందించడానికి లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టును నిర్మించామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు సాగునీరు కోసం ప్రజలు తాగునీరు కోసం ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం వారి కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నారే తప్ప రైతాంగాన్ని ఉద్ధరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన ఎద్దేవా చేశారు. జిల్లా రైతులు మరియు ప్రజలు తాగునీటికీ సాగునీటికి ఇబ్బంది పడుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అలీ సాగర్ గూత్ప లాంటి ప్రాజెక్టులు నిర్మించామని ఆయన గుర్తు చేశారు.రైతుబంధు పేరుతో డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని రైతులకు అదనంగా ఇచ్చే సబ్సిడీ విత్తనాలు, బ్యాంకుల రుణాలు, సబ్సిడీ ఎరువులు లాంటివి లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. జిల్లాలో ఉన్న వరి ,మొక్కజొన్న ,పసుపు రైతులు సాగునీరు మరియు వ్యవసాయ సబ్సిడీలు లేక పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక నానా ఇబ్బందులు పడుతుంటే జిల్లాలో ఉన్న మంత్రి మరియు ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్టు కూడా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం మరియు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు రైతుల పట్ల తమ వైఖరిని మార్చుకొని రైతాంగానికి మేలు చేసేలా పథకాలను అమలు చేయాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రైతాంగం మరియు జిల్లా రైతులు కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు విత్తనాల దగ్గర నుండి పంట చేతికొచ్చి వరకు పంట రుణాలతో పాటు వ్యవసాయ యంత్రాలు , సబ్సిడీ ఎరువులు కూడా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్బీన్ హందాన్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, ముప్ప గంగారెడ్డి, మీసాల సుధాకర్, జావేద్ అక్రమ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, విక్కీ యాదవ్, రామర్తి గోపి, సంతోష్, పోల ఉష, రేవతి, విజయలక్ష్మి, విపుల్ చంద్రకళ, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love