ఇంట్లోనే భర్త మృతదేహానికి దహనం..

నవతెలంగాణ – కర్నూలు: జిల్లా పత్తికొండలో దారుణం చోటుచేసుకుంది. గుండెపోటుతో చనిపోయిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు పూర్తిచేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిప్రసాద్‌ (60) ఇటీవల గుండెపోటుతో మృతి చెందినట్లు సదరు మహిళ చెబుతోంది. పిల్లలిద్దరూ కెనడాలో ఉన్నారని తనకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే భర్త మృతదేహాన్ని దహనం చేసినట్లు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love