సౌండ్‌ పార్టీ రిలీజ్‌కి రెడీ

Sound Party is ready for releaseఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం-1గా రూపొందిన చిత్రం ఃసౌండ్‌ పార్టీః. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటించారు. రవి పోలిశెట్టి, మహేం ద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్‌ సమ ర్పణ. సంజరు శేరి దర్శకుడు. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా ఈనెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ, ఃఇప్పటికే విడుదలైన మా చిత్ర టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. బిజినెస్‌ పరంగా కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం ఆడియెన్స్‌ ఫన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. అదే తరహాలో తెరకెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాంః అని తెలిపారు. ఃపాటలు, టీజర్‌ సినిమాను ఇప్పటికే పబ్లిక్‌లోకి తీసుకెళ్లాయి. దర్శకుడు సంజరు శేరికి ఏ నమ్మకంతో సినిమా ఇచ్చామో దాన్ని నిలబెట్టుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ తీశాడుః అని సమర్పకుడు జయ శంకర్‌ చెప్పారు. దర్శకుడు సంజరు శేరి మాట్లాడుతూ, ఃఇటీవల సినిమా చూసి యూనిట్‌ అంతా హ్యాపీగా ఫీలయ్యాం. ఈ నెల 24న వస్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్‌ వస్తుందని నమ్ముతున్నాంః అని అన్నారు.

Spread the love