చారి 111గా వెన్నెల కిశోర్‌

యాక్షన్‌ ఎపిసోడ్‌తో షురూ..‘వెన్నెల’ కిశోర్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్తా విశ్వనాథన్‌  కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ మాట్లాడుతూ, ‘ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్‌ చేసే కన్‌ఫ్యూజ్డ్‌ స్పై ‘వెన్నెల’ కిశోర్‌ ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్‌ చేశాడనేది సినిమాలో చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు’ అని చెప్పారు. ‘స్పై జోనర్‌ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్‌ నటన, టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం సినిమాకు హైలైట్‌ అవుతాయి. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఫస్ట్‌ లుక్‌ ఫెంటాస్టిక్‌ రెస్పాన్స్‌ అందుకుంటోంది’ అని నిర్మాత అదితి సోనీ చెప్పారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ‘చారి 111’ పాటలు విడుదల కానున్నాయి.

Spread the love